5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్

5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్‌ సెమీస్‌లో భారత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. 240 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియా టపటపా వికెట్లను కోల్పోయింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌శర్మతోపాటు కెప్టెన్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌లు పెవిలియన్‌ చేరారు. మాట్‌ హెన్రీ వేసిన 1.3వ బంతికి రోహిత్‌ శర్మ (1) అవుటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్‌ కోహ్లీని బౌల్ట్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపించాడు. 3.1వ బంతికి కేఎల్‌ రాహుల్‌ అవుటాయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 5 పరుగులు. కార్తిక్‌, పంత్‌ క్రీజులో ఉన్నారు.