ఇన్ఫినిక్స్ నోట్-5 వచ్చేసింది

ఇన్ఫినిక్స్ నోట్-5 వచ్చేసింది

చైనీస్ మొబైల్ మేకర్ ఇన్ఫినిక్స్...కొత్త నోట్ ను ఇండియా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ నోట్ 5 పేరుతో ఇది మార్కెట్ లో లభ్యం అవుతోంది. ఫుల్ హెచ్‌డీ+ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఈ నోట్ కలిగి ఉంది. గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్ యూజర్లకు గొప్ప అనుభూతి ఇవ్వనుంది. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ఫొటోలు, గూగుల్ లెన్స్ ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఆటో సీన్ డిటెన్షన్, ఏఐ పవర్ మేనేజ్‌మెంట్ వంటి వాటితో వస్తుండడం విశేషం. అది కూడా రూ.9,999 కనీస ధరతో వస్తుండడం గమనార్హం. షియోమీ రెడ్‌మీ నోట్-5, ఆనర్ 9లైట్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. ఇన్ఫినిక్స్ నోట్ 5లో  డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 3జీబీ/4జీబీ ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటుఉంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉపయోగించారు.