అంచనాలను మించిన ఇన్ఫోసిస్‌

అంచనాలను మించిన ఇన్ఫోసిస్‌

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అద్భుత ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో మార్కెట్‌ అంచనాలను మించి కంపెనీ ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీ రూ. 4110 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మార్కెట్‌ విశ్లేషకులు రూ. 4048 కోట్లు అంచనా వేశారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 20,609 కోట్ల టర్నోవర్‌ సాధించింది. మొత్తం వ్యాపారంలో డిజిటల్ విభాగం వాటా 31 శాతానికి చేరినట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ 22 శాతం నుంచి 24 శాతం వరకు ఉండొచ్చని ఇన్ఫోసిస్‌ ప్రకటించింది.