ఇన్ఫీ లాభం తగ్గినా... 

ఇన్ఫీ లాభం తగ్గినా... 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ రూ. 3610 కోట్ల  నికరలాభాన్ని ప్రకటించింది.  అంతక్రితం త్రైమాసికంలో కంపెనీ రూ. 4110 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ టర్నోవర్‌ మాత్రం రూ.20,609 కోట్ల నుంచి రూ. 21,400కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే పది శాతంపైగా పెరిగిందని, పూర్తి ఏడాదికి గైడెన్స్‌ ప్రకారం ఫలితాలు సాధిస్తామని చెప్పిన కంపెనీ, వచ్చే ఏడాదికి గైడెన్స్‌ను పెంచింది.

రూ. 8,260కోట్లతో బైబ్యాక్‌..
కంపెనీ రెండోసారి షేర్ల బైబ్యాక్‌ చేసేందుకు ఇన్ఫోసిస్‌ బోర్డు ఆమోదించింది. షేరు ధర రూ. 800 చొప్పున రూ. 8,260కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కాకుండా... మార్కెట్‌ నుంచి షేర్లను కొనుగోలు చేస్తారు. అంటే ధర తగ్గినపుడల్లా కంపెనీ షేర్లు కొంటుందన్నమాట. అలాగే   ఒక్కో షేరుకు రూ. 4 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను కూడా ఇవ్వాలని కూడా కంపెనీ ప్రకటించింది.