బ్రిటన్‌ కేబినెట్‌లోకి ఇన్ఫోసిస్‌ మూర్తి అల్లుడు..!

బ్రిటన్‌ కేబినెట్‌లోకి ఇన్ఫోసిస్‌ మూర్తి అల్లుడు..!

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాప‌కుడు నారాయ‌ణ‌మూర్తి అల్లుడు రిషి సునాక్‌కు బ్రిటన్‌ మంత్రివర్గంలో చోటు ద‌క్కింది. నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బోరిస్‌ జాన్సన్‌.. రిషిసహా మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు తన కేబినెట్‌లో ఛాన్స్‌ ఇచ్చారు. గతంలో థెరిసా మే ప్రభుత్వంలోనూ రిషి మంత్రిగా పనిచేశారు. 
హ్యాంప్‌షైర్‌లో జన్మించిన రిషి.. ఆక్స్‌ఫోర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు. 2014లో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. 2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చదివే రోజుల్లో ఇన్సోసిస్‌ నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసి పెళ్లి వరకూ వెళ్లింది.