ఇన్ఫోసిస్‌ 1ః1 బోనస్‌

ఇన్ఫోసిస్‌ 1ః1 బోనస్‌

ఇన్ఫోసిస్‌ కంపెనీ మరోసారి బోనస్‌ ప్రకటించింది. ఇన్వెస్టర్ల వద్ద ఉన్న ఒక షేర్‌కు ఒక షేర్‌ను బోనస్‌గా ఇవ్వాలని ఇవాళ సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ ఫలితాలను బోర్డు ప్రకటించింది. మార్కెట్‌ వర్గాల అంచనా మేరకు కంపెనీ ఫలితాలు లేనట్లు వార్తలు వస్తున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 3612 కోట్ల నికర లాభం ప్రకటించింది.అంతక్రితం త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 3690 కోట్లు. అంటే నికర లాభం సుమారు 2 శాతం క్షీణించింది. కంపెనీ ఆదాయం 19 శాతం పెరిగి రూ. 19,128 కోట్లకు చేరింది. కంపెనీ రూ. 19,093 కోట్ల ఆదాయంపై రూ. 3,747 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని రాయిటర్స్‌ వార్త సంస్థ జరిపిన సర్వేలో విశ్లేషకులు అంచనా వేశారు. అయితే నికరలాభం అంచనాలను చేరుకోలేకపోయింది.  కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ కూడా 24.7 శాతం నుంచి 23.7 శాతానికి క్షీణించింది. పనయా సంస్థకు సంబంధించిన వివాదంలో సంప్రదింపులు జరుపుతున్నాయని, ఆ సంస్థ పద్దు కింద రూ. 270 కోట్లను పక్కన పెట్టామని ఇన్ఫోసిస్‌ పేర్కొంది.