'ఇన్ఫోసిస్‌' సుధామూర్తి గొప్ప మనసు

'ఇన్ఫోసిస్‌' సుధామూర్తి గొప్ప మనసు

కేరళ బాధితులను ఆదుకునేందుకు టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సామాజిక కార్యకర్త సుధామూర్తి ముందుకొచ్చారు. వరదల్లో చిక్కుకున్న కొడగు జిల్లాలోని ప్రజలకు సాయం చేయడానికి ఇన్ఫోసిస్‌ ఉద్యోగులతో కలిసి వరద బాధితులకు నిత్యావసరాలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమె స్వయంగా సరుకులను ప్యాక్‌ చేయడంతోపాటు సంస్థ ఉద్యోగుల పనిని దగ్గరుండి పర్యవేక్షించారు. సామాన్లు సర్దుతున్న బృందంతో కూడా కలిసిపోయి వారికి తనవంతుగా సాయం అందించారు. సుధామూర్తి ఔదార్యాన్ని వీడియో తీసిన కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. ఈ వీడియోను లక్షలాది మంది చూసి, సుధామూర్తి సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు. అంతేకాదు అమ్మ అనే హ్యాష్ టాగ్ తో షేర్ చేసుకుంటున్నారు.