ఢిల్లీలో గాలిని ఇలా అమ్మేస్తున్నారు.. 

ఢిల్లీలో గాలిని ఇలా అమ్మేస్తున్నారు.. 

ఢిల్లీ లో పొల్యూషన్ ఏ స్థాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  గాలిలో విషవాయులు ఎక్కువగా ఉంటున్నాయని, ఈ పొల్యూషన్ ఇలానే పెరిగితే.. ఢిల్లీలో మనిషి బ్రతకడం కష్టం అవుతుందని సాక్షాత్తు సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే.  ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల సీఎస్ లను పిలిపించి వార్నింగ్ ఇచ్చింది సుప్రీం కోర్టు.  

ఇప్పుడు చలికాలం మొదలవడంతో ఈ పొల్యూషన్, చలిగాలులో మిక్స్ అయ్యి శ్వాససంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు.  ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, మాములు షాపింగ్ కు వెళ్లినట్టు వెళ్లి.. స్వచ్ఛమైన ఆక్సిజన్ ను హాయిగా పీల్చుకొని ఇంటికి వచ్చెయ్యొచ్చు.  అవును.. ఇది నిజం.. ఢిల్లీలోని  ఢిల్లీలోని సిటీ వాక్ మాల్, సాకేత్ తో ప్యూర్ ఆక్సిజన్ అనే పేరిట కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు.  అక్కడ ప్యూర్ ఆక్సిజన్ ను వివిధ ఫ్లేవర్స్ తో మిక్స్ చేసి అమ్ముతురున్నారు.  రూ. 299 నుంచి ధర ప్రారంభం అవుతుంది.  బ్రహ్మాంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా జరుగుతున్నాయి.