స్విట్జర్లాండ్ లో ఆకాశ్ అంబానీ-శ్లోకాల పెళ్లి వేడుకలు

స్విట్జర్లాండ్ లో ఆకాశ్ అంబానీ-శ్లోకాల పెళ్లి వేడుకలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల పెళ్లి వేడుకలు స్విట్జర్లాండ్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కాబోయే కొత్త జంట పేరు మీద సోషల్ మీడియాలో వచ్చిన హ్యాష్ ట్యాగ్ AkuStoleTheShlo తెగ ట్రెండ్ అవుతోంది.

అంబానీలు, మెహతాలు కలిసి వాళ్ల కుటుంబసభ్యులు, మిత్రులకు ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లోని రిసార్ట్ టౌన్ సెయింట్ మోరిట్జ్ లో మూడు రోజుల పాటు విలాసవంతమైన ఆతిథ్యం ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా ఖాన్ ఇప్పటికే అక్కడ వాలిపోయారు. సోషల్ మీడియాలో వింటర్ వండర్లాండ్ థీమ్ వేడుకలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. 

అంబానీలు అత్యంత విలాసవంతమైన బాడ్రట్ ప్యాలెస్ ని బుక్ చేసుకున్నారు. లూనా పార్క్ లో ప్రత్యేకంగా ఫెర్రీస్ వీల్ కార్నివాల్ ఏర్పాటు చేశారు. ఈ స్విస్ నగరానికి మొత్తంగా 850 మంది అతిథులు వస్తున్నారని తెలిసింది.

కాబోయే కొత్త దంపతులు ఒక తెల్ల గుర్రపు బగ్గీలో వచ్చారు. శ్లోకా ఫర్ కోట్ తో తెల్ల డ్రెస్ వేసుకోగా ఆకాశ్ మఫ్లర్, కోట్ ధరించాడు.

రాత్రి అద్భుతమైన డ్రోన్ షో అతిథులను అబ్బురపరిచింది. నల్లటి ఆకాశంలో రొటేటింగ్ స్నో ఫ్లేక్స్, పక్షులు వగైరా విన్యాసాలను అంతా కళ్లప్పగించి చూశారు.

నల్లకోటు వేసుకొన్న ముకేష్ అంబానీ ఇటీవలే పెళ్లయిన తన కూతురు ఈశాతో కలిసి కార్నివాల్ లో తిరుగుతూ కనిపించారు.

ఇంత అట్టహాసంగా జరుగుతున్న కార్నివాల్ చూసేందుకు స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులు కూడా తండోపతండాలుగా తరలి వచ్చారు.

సెయింట్ మోరిట్జ్ లో అతిథుల కోసం పాపులర్ బ్యాండ్ మెరూన్ 5 పెర్ఫామ్ చేయనున్నట్టు తెలిసింది. 

స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత రెండు కుటుంబాలు ముంబైలో మార్చి 9న ఘనంగా వివాహం జరిపించనున్నాయి. 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Isn’t this stunning ! ❄️ #akustoletheshlo Via - @_marcohartmann_

A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Night scenes at St. Mortiz for Akash Ambani Pre-Wedding Celebrations ! via - @stmoritz

A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Such dreamy nights ! ???? via - @stmoritz

A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on