సల్మాన్ ఫామ్ హౌస్ లో జాక్వెలిన్ ... ఓ రోజంతా ఏం చేసిందో చూశారా ?

సల్మాన్ ఫామ్ హౌస్ లో జాక్వెలిన్ ... ఓ రోజంతా ఏం చేసిందో చూశారా ?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ముంబై కు సమీపంలో విశాలమైన స్థలంలో ఓ ఫామ్ హౌస్ ఉన్నది.  దానిపేరు పాన్ వెల్ అనే పేరు పెట్టారు సల్మాన్.  తీరిక సమయంలో సల్మాన్ అక్కడ గడుపుతుంటాడు.  కరోనా కారణంగా సల్మాన్ ఖాన్ ఇటీవలే తన ఫామ్ హౌస్ కూరగాయలు, పప్పులు, బియ్యం వంటివి వివిధ గ్రామాలకు ట్రాక్టర్ల మీద, ఎడ్ల బండి మీద పంపించారు.  ఈ విషయంలో సల్మాన్ స్నేహితురాలు, నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా సహాయం చేసింది. 

ఫామ్ హౌస్ లో సల్మాన్ ఖాన్ తో పాటుగా సహాయ సహకారాలు అందించింది.  కాగా, ఈ ఫేమస్ నటి ఫామ్ హౌస్ లో కొన్ని రోజులు ఉండిపోయింది.  సల్మాన్ ఫామ్ హౌస్ లో ఓ రోజు అనే పేరుతో చిన్న వీడియో రూపొందింది ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.  ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం చేసింది అన్నది చిన్న వీడియో రూపంలో షూట్ చేశారు.  బ్రేక్ ఫాస్ట్, ఫేమ్ హౌస్ లో ఉండే జంతువులతో ఆదుకోవడం, కొబ్బరి చెట్టు ఎక్కేందుకు ప్రయత్నం చేయడం, గుర్రానికి స్నానం చేయించి దానిపై ఎక్కి రైడ్ చేయడం వంటివి చేసింది.  ఈ ఇంస్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on