ఇన్స్పెక్టర్ శంకరయ్య కేసులో మరో కొత్తకోణం: జయరాం హత్యకేసు నిందితుడితో సంబంధాలు..
ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో ఇటీవలే ఏసీబీ అధికారులు చేవెళ్ల ఇన్స్పెక్టర్ శంకరయ్యను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారులు ఆయనకు సంబంధించి రూ.40 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఈ విచారణలో మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శంకరయ్యకు పాత నేరస్తులతో సంబంధాలు ఉన్నట్టు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిగురుపాటి జయరాం హత్యకేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డికి ఇన్స్పెక్టర్ శంకరయ్య అనేక రకాలుగా సహకరించారని విచారణలో తేలింది. దీంతో అధికారులు షాక్ అయ్యారు. జయరాం, శిఖా చౌదరి కాల్ రికార్డులు చేసేందుకు నిందితుడికి ఇన్స్పెక్టర్ శంకరయ్య సహకారం అందించారు. దుండిగల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు రాకేష్ రెడ్డితో కలిసి ఇన్స్పెక్టర్ శంకరయ్య ల్యాండ్ సెటిల్ మెంట్లు చేసినట్టు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇంకా లోతైన విచారణ చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)