భార్య కోసం చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసిన భర్త...ఎక్కడంటే...!!

భార్య కోసం చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసిన భర్త...ఎక్కడంటే...!!

నచ్చిన వ్యక్తులకు విలువైన గిఫ్ట్ లు ఇవ్వడం సహజమే.  తాహతును బట్టి గిఫ్ట్ లు ఇస్తుంటారు.  అయితే, పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఏకంగా ఎకరం స్థలం గిఫ్ట్ గా ఇచ్చాడు.  అదీ భూమిపై కొన్న స్థలం కాదు, చంద్రునిపై కొన్న స్థలం.  చంద్రునిపై స్థలం కొనుగోలు చేయడం వలన ఉపయోగం ఏముంటుంది చెప్పండి.  ఇప్పుడు ఉపయోగం లేకపోవచ్చు.  భవిష్యత్తులో చంద్రునిపై మనుషులు ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది.  పాకిస్తాన్ లోని రావల్పిండికి చెందిన సొహైబ్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్యకు సి ఆఫ్ వేపర్ అనే ప్రదేశంలో ఓ ఎకరం స్థలం కొనుగోలు చేశాడు.  దీని ధర రూ.3300 ఉన్నట్టు అహ్మద్ తెలిపారు.  ఇంటర్నేషనల్ ల్యూనార్ ల్యాండ్ రిజిస్ట్రీలో ఈ స్థలం కొనుగోలు చేశాడు.  ఈ సంస్థ నుంచి ల్యాండ్ కు సంబంధించిన ఒరిజినల్ డాకుమెంట్స్ ఇటీవలే అహ్మద్ కు అందడంతో వాటిని తన భార్యకు గిఫ్ట్ గా అందించాడు.  ఇక ఇదిలా ఉంటె, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కు గ్రహాలపై స్థలాలు కొనుగోలు చేయడం అంటే చాలా ఆసక్తి. 2018 లో సుశాంత్ సింగ్ మారే ముస్కోవిన్స్ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశాడు.  ఈ ఇన్స్పిరేషన్ తో చాలామంది స్థలాలు కొనుగోలు చేశారు.