కిడ్స్ కోసం ఇన్ స్టా గ్రామ్ ప్రికాషన్స్..

కిడ్స్ కోసం ఇన్ స్టా గ్రామ్ ప్రికాషన్స్..

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్.. తన సామాజిక బాధ్యతను మరింతగా చాటుకుంది. సోషల్ మీడియా దుష్ప్రభావలకు పిల్లలు లోనవకుండా ఉండేందుకు పేరెంట్స్ కోసం వెబ్ సైట్లోనే ఓ ప్రత్యేకమైన సెక్షన్ ను కేటాయించింది. దీని ద్వారా పేరెంట్స్ ప్రైవసీ సెట్టింగ్స్ వెళ్లడంతో పాటు టైమ్ ను, కంటెంట్ ను కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఇలా చేయడం ద్వారా అవాంఛనీయమైన కంటెంట్ పిల్లల కంట్లో పడకుండా జాగ్రత్తపడే వెసులుబాటు చిక్కింది. ఈ పోర్టల్ ద్వారా ఇన్ స్టా గ్రామ్ యాప్ గురించి పిల్లలతో నేరుగా మాట్లాడవచ్చు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. పాజిటివ్ రోల్ మోడల్స్ గురించి సజెస్ట్ చేయవచ్చు. ఇలా పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేందుకు ఇన్ స్టా గ్రామ్ తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నటు పేర్కొంటోంది.