మరోసారి ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం..!

మరోసారి ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం..!

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును ఇంకా నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటికే ఈ ఏడాది ఫలితాల్లో అవకతవకలతో అబాసుపాలైన బోర్డు.. తాజాగా అడ్వాన్స్‌డ్ సఫ్లిమెంటరీ ప్రశ్న పత్రాలను భద్రపరచడంలో కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వరంగల్ పోలీస్ స్టేషన్‌లో ఉంచిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నపత్రాలు గల్లంతయ్యాయి. ఎల్లుండి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. అయితే, వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచన రెండు ప్రశ్నపత్రాల షీల్డ్ బాక్సెక్ కనిపించకుండా పోవడం.. అధికారుల నిర్లక్ష్యాన్నికి అద్దంపడుతోంది. దీంతో రెండు రోజులుగా పోలీసులు, ఇంటర్ బోర్డు అధికారులు.. ఆ బాక్స్‌ల కోసం రహస్యంగా వెతుకుతున్నారు. అయితే, పోలీసులు మాత్రం వాటికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాదే... వారికి రూమ్ కేటాయించాం.. అందులోకి వెళ్లింది ఇంటర్ బోర్డు అధికారులే.. ప్రశ్నపత్రాల మిస్సింగ్‌తో మాకు సంబంధంలేదని చెప్పినట్టుగా తెలుస్తోంది.