బ్రేకింగ్ : వెనక్కి తగ్గిన ఇంటర్ బోర్డ్, ఉత్తర్వులు ఉపసంహరణ

బ్రేకింగ్ : వెనక్కి తగ్గిన ఇంటర్ బోర్డ్, ఉత్తర్వులు ఉపసంహరణ

17 వ తేదీ నుండి ప్రభుత్వ ,ఎయిడెడ్ జూనియర్ కళాశాలల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది హాజరు కావాలని ఇంటర్ మీడియట్ విద్యా కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు తెరవొద్దని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆన్లైన్ తరగతులు జరిగినా సరే ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు మాత్రం తెరుచుకోవని విద్యాశాఖ వర్గాలు అంటున్నారు. అంతకు ముందు విడుదల చేసిన ఉత్తరువుల ప్రకారం ప్రభుత్వ కాలేజీల్లో పని చేస్తున్న స్టాఫ్ అందరూ కాలేజీకి రావాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. 17 వ తేదీ నుండి ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది కళాశాలల కి హాజరు కావాలని ముందు ఇచ్చిన ఉత్తరువుల్లో పేర్కొన్నారు.  అడ్మిషన్స్ మీద కూడా లెక్చరర్లు దృష్టి పెట్టాలని ఆయన కోరారు.