మైనర్ల ప్రేమ..? ఐదో అంతస్తు నుంచి దూకి...

మైనర్ల ప్రేమ..? ఐదో అంతస్తు నుంచి దూకి...

కర్నూలు జిల్లా నంద్యాల సలీంనగర్‌లో విషాద ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ భవనం ఐదో అంస్తు పై నుంచి దూకి ఇంటర్ సెకండియర్ విద్యార్థి సన్నీ మోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మోహిత్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. మైనర్ అయిన మోహిత్.. అదే గ్రామానికి చెందిన బాలికతో ప్రేమలో పడినట్టు.. దీంతో బాలికను కిడ్నాప్ చేశాడంటూ మోహిత్‌పై ఆ బాలిక తండ్రి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మోహిత్‌ను పోలీస్ స్టేషన్‌కు  పిలిపించారు పోలీసులు. అయితే, పీఎస్‌ నుంచి తప్పించుకుని పారిపోయిన మోహిత్.. బాలిక ఇంటి సమీపంలోని భవనం ఎక్కి.. ఐదో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.