మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యయత్నం

మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యయత్నం

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో మరో విద్యార్ధి ఆత్మహత్యయత్నం చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లెకు చెందిన ప్రవీణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అక్షర జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివాడు. పరీక్షలు బాగా రాశానని, తప్పకపాసవుతానని అందరితో చెప్పాడు. కానీ ఫలితాల్లో మాత్రం అతడు ఏకంగా 8 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తేలింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రవీణ్ పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.