ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఈ నెల 14వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ప్రకటించారు. ఇవాళ అమరావతిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ పరీక్షలకు మొత్తం 4,24, 500 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. వీరి కోసం 922 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. లక్షా 75 వేల మంది ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు రాస్తున్నారన్న ఉదయలక్ష్మి.. ఫస్టియర్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెకెండియర్‌ పరీక్షలు  మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు నిర్వహిస్తామని తెలిపారు. జ్ఞానభూమి వెబ్ సైట్‌లో హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలు జూన్‌ మొదటి వారంలో విడుదల చేస్తామన్నారు.