వారణాశిలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు..!

వారణాశిలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు..!

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ 59 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా... వారణాశిలో ఎన్నికల పోరు మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాశిలో కూడీ ఇవాళే పోలింగ్ జరుతుండగా... ప్రధాని నరేంద్ర మోడీపై మరో 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అజయ్ రాయ్, మహా కూటమి నుంచి ఎస్పీ అభ్యర్థి శాలినీ యాదవ్ బరిలో ఉండగా... మోడీకి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేశారు పలువురు రైతులు. వీరిలో పలువురి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా... తుది జాబితాలో ఇద్దరు తెలుగు రైతులు మిగిలారు. జాబితాలో 25వ అభ్యర్థిగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు సున్నం ఇస్తారి ఉన్నారు. 24వ అభ్యర్థిగా విశాఖపట్నంకు చెందిన మానవ్ ఉన్నారు.