బాలుని రంగంలోకి దించిన వర్మ..

బాలుని రంగంలోకి దించిన వర్మ..

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై వర్మ క్లారిటీ ఇవ్వలేదుగాని రిలీజ్ డేట్ ను మాత్రం ముందుగానే ప్రకటించాడు.  జనవరి 24 న సినిమా రిలీజ్ కాబోతున్నది.   గతంలో తెలుగు సినిమా పాటలకు ఎస్పీ బాలు గాత్రం అందించేవారు.  ట్రెండ్ మారడంతో సినిమా పాటలకు ఆయన దూరంగా ఉంటున్నాడు.  

ఏదైనా స్పెషల్ ఉంటేనే గాని బాలు పాటలు పాడటం లేదు.  ఇప్పుడు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం బాలు పాట పాడుతున్నాడు. దీంతో ఈ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది.  బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ కు కీరవాణి సంగీతం అందిస్తుంటే.. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కీరవాణి తమ్ముడు కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.