ఆసక్తి రేపుతున్న ప్రభాస్ సాహో పోస్టర్

ఆసక్తి రేపుతున్న ప్రభాస్ సాహో పోస్టర్

అప్పుడెప్పుడో ప్రభాస్ పుట్టినరోజున అలాగే హీరోయిన్ శ్రద్ధ కపూర్ పుట్టినరోజున నాడు సాహో సినిమాకు సంబంధించిన ఆఫీసర్ ఫొటోస్, టీజర్ లు రిలీజ్ చేశారు.  మళ్ళీ నిన్నటి వరకు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ రావడమే కానీ ఫోటోలు ఏవి బయటకు రాలేదు.  దీంతో అసలు సాహో లో ఏం జరుగుతుంది అనే దానిపై అందరికి ఉత్కంఠత కలిగింది.  భారీ బడ్జెట్ సినిమా కావడమతో అన్నింటిలా కాకుండా అప్పుడప్పుడు సినిమాలోనుంచి ఫోటోలను బయటకు వదులుతూ ఉంటె హైప్ వస్తుంది.  అలా చేయకుండా సైలెంట్ రిలీజ్ కు ముందు అన్ని బయటపెడితే ఉపయోగం పెద్దగా ఉండదు.  

కాగా, ఈరోజు సాహో నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని ఉన్న ఫొటో అది. స్కై డైవింగ్ చేసే వ్యక్తులు ఆరకం కళ్ళజోడు పెట్టుకుంటారు.  సింపుల్ గా ఉంన్నా ప్రభాస్ కళ్ళు మాత్రం దేని మీదనో దృష్టిపెట్టినట్టుగా ఉన్నాయి.  తీక్షణంగా వెతుకుతున్నట్టు కనిపిస్తున్నాయి.  ఈ ఫోటో తో మరలా సాహో వార్తల్లోకి వచ్చింది.  మరి మిగతావి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.