ఎన్టీఆర్ ను ఎలా చూపించారంటే..!!

ఎన్టీఆర్ ను ఎలా చూపించారంటే..!!
సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతున్న అంశాల్లో మహానటి ఒకటి.  సావిత్రి జీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో అప్పటి తరం మహామహుల పాత్రలలో ఇప్పటి తరం నటులు నటించారు.  సావిత్రి నట జీవితంలో సంబంధాలు ఉన్న అందరిని ఈ సినిమాలో చూపించబోతున్నారు.  అప్పటి మహానటులు పాత్రలలో ఇప్పటి తరం నటులు ఎలా మెప్పించారో త్వరలోనే తేలిపోతుంది.  
ఇందులో అన్ని పాత్రలకు అందరిని తీసుకున్నా ఎన్టీఆర్ పాత్రకు మాత్రం ఎవరిని తీసుకున్నారు అన్నది సందేహంగా మారింది.  ఎన్టీఆర్ పాత్రకోసం తారక్ ను సంప్రదిస్తే.. ఆ పాత్రలో నటించే దైర్యం తనకు లేదని చెప్పి తప్పుకున్నాడు.  తారక్ తరువాత ఆ పాత్రకోసం ఎవరిని సంప్రదించలేదు.  మరి ఆ పాత్రను ఎలా తీర్చిదిద్దారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.  
ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణను డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించారని, ఎన్టీఆర్ అభిమానులు ఆశ్చర్యపోయేవిధంగా ఆ పాత్రను తీర్చిదిద్దారని తెలుస్తోంది.  ఒకవేళ ఈ పాత్రను గ్రాఫిక్ ద్వారా క్రియేట్ చేసి ఉంటె.. డిజిటల్ టెక్నాలజీలో తారక్ ను చూపించారా లేదంటే పెద్ద ఎన్టీఆర్నే గ్రాఫిక్స్ లో చూపించారా అన్నది తెలియాలి.  ఇది తెలియాలంటే మే 9 వరకు ఆగాల్సిందే.