మెగాహీరో జాలరి

మెగాహీరో జాలరి

మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రీసెంట్ గా లాంచ్ అయ్యింది.  గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దీనికి దర్శకుడు.  సినిమా ఓపెనింగ్ రోజునే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.  పక్కా పల్లెటూరి వ్యక్తిగా ఉండటంతో.. ఈ సినిమాలో రామ్ చరణ్ రంగస్థలం సినిమా ఛాయలు ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ వచ్చింది.  

ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  అదేమంటే, వైష్ణవ్ తేజ్ చేస్తున్న ఈ సినిమాకు జాలరి అనే టైటిల్ పెట్టబోతున్నారని, కథకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని అంటున్నారు.  దీనినిబట్టి చూస్తే.. ఇది మత్యకారుల సినిమా అని అర్ధం అవుతున్నది.