రాజశేఖర్ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ !

రాజశేఖర్ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ !

చాన్నాళ్ల తరవాత 'గరుడవేగ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న సీనియర్ హీరో రాజేఖర్ ప్రస్తుతం 'అ !' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  

ఈ చిత్రానికి 'కల్కి' అనే టైటిల్ అనుకుంటున్నారట.  ఆసక్తికరంగా వినిపిస్తున్న ఈ టైటిల్ వెనుక కొత్త తరహా కథ ఉందని అంటున్నారు.  1980ల తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో మరొక సక్సెస్ అందుకోవడం ఖాయమని రాజశేఖర్ భావిస్తున్నారు.