బిగ్‌బాస్ పిలుపు.. ఓన్లీ ఫ‌ర్ ల‌వ్ క‌పుల్‌?

బిగ్‌బాస్ పిలుపు.. ఓన్లీ ఫ‌ర్ ల‌వ్ క‌పుల్‌?
అస‌లే ఏండాకాల‌మ్‌.. అటుపై మండే కాలం! ఇలాంటి మంట‌ల వేళ ఇంకా ఇంకా మంట పెట్టేందుకా? అన్న‌ట్టు బిగ్‌బాస్ కొత్త సీజ‌న్‌లు మొద‌లు కానున్నాయ్‌.. ఓవైపు టాలీవుడ్‌లో, మ‌రోవైపు బాలీవుడ్, కోలీవుడ్‌, శాండిల్వుడ్‌, మ‌రాఠా ప‌రిశ్ర‌మ‌ల్లోనూ `బిగ్‌బాస్‌` కొత్త సీజ‌న్లు మొద‌లెట్టేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయ్‌. మ‌రాఠాలో బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా మ‌హేష్ మంజ్రేక‌ర్‌ని ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ రియాలిటీ షోస్‌తో స్టార్ గ్రూప్ ఆదాయం ఓ రేంజులో ఉందనేది ఇన్‌సైడ్ టాక్‌. ఇక హిందీ `బిగ్‌బాస్` ఇప్ప‌టికే 11 సీజ‌న్లు పూర్త‌య్యాయి. స‌ల్మాన్ భాయ్ హోస్టింగుతో న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న చందంగా టీఆర్‌పీలు అందుకుంటూ అద‌ర‌గొట్టేస్తోంది షో. ఈసారి కొత్త సీజ‌న్‌ని ప్రారంభించేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి. బిగ్‌బాస్ -11 ప‌లు ర‌కాల డ‌ర్టీ వివాదాల‌తో బాలీవుడ్ అట్టుడికిపోయింది. గ్యాంగ్‌స్ట‌ర్లు, డ‌ర్టీ భామ‌ల‌కు అవ‌కాశం ఇచ్చి వేడెక్కించారు గ‌త సీజ‌న్‌ని. ఈసారి అంత‌కుమించి హీట్ పెంచేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి. అంతేకాదు స‌ల్మాన్ భాయ్ స్వ‌యంగా ఈ సీజ‌న్ కోసం ఎలాంటి ఎంపిక‌లు చేయ‌నున్నారో వెల్ల‌డించారు. ``బిగ్‌బాస్‌కి జంట‌లు కావ‌లెను`` అని ప్ర‌క‌టించారు. ఇదంతా మంట‌లు పెట్టేందుకే! హీట్ అంత‌కంత‌కు పెంచే ఆలోచ‌న‌లో స‌ల్మాన్ భాయ్ బృందం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే సేమ్ టు సుమ్ ఫార్ములాని టాలీవుడ్ `బిగ్‌బాస్‌-2`కి అప్ల‌య్ చేస్తారా? అన్న‌ది వేచి చూడాలి.