ప్రభాస్ కథను ఎలా చూపించబోతున్నారు..?

ప్రభాస్ కథను ఎలా చూపించబోతున్నారు..?

ప్రభాస్ సాహో తో పాటు జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఇటలీలో ఈ కథ నడుస్తుంది.  1960 కాలానికి చెందిన కథను ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ సినిమా ఉంటుంది.  ఇందులో ప్రభాస్ పాత్రను చాలా ఆసక్తికరంగా చూపించబోతున్నారు. 1960 లో సినిమా ప్రారంభమౌతుంది.. అంతేకాదు ప్రభాస్ వింటేజ్ కార్లను ఇష్టపడే వ్యక్తిగా కనిపించబోతున్నాడు.  అలాగే ప్రస్తుత కాలానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడు.  అంటే రెండు పాత్రల్లో ప్రభాస్ కనిపిస్తాడన్నమాట.  

ఈ విషయాలను బట్టి చూస్తే.. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేసే అవకాశం కనిపిస్తోంది.  భిల్లా సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.  ప్రభాస్ 20 వ సినిమాలో డ్యూయెల్ రోల్ ను చూపిస్తారా లేదంటే.. ఆ కాలానికి చెందిన వ్యక్తి... అనుకోకుండా.. ప్రస్తుత కాలానికి ఫాస్ట్ ఫార్వార్డ్ అయ్యాడా అన్నది ఆసక్తికరంగా మారింది.