ఇంటర్‌ ప్రవేశాలకు షెడ్యూల్‌.. కీలక సూచనలు

ఇంటర్‌ ప్రవేశాలకు షెడ్యూల్‌.. కీలక సూచనలు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఈ నెల 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నదని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. ఒక్కో సెక్షన్‌లో 88 మందికి మించి చేర్చుకోకూడదని స్పష్టం చేసిన ఆయన.. అందులో 33 శాతం బాలికలను ప్రవేశాలు కల్పించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కళాశాలల యాజమాన్యాలకు హెచ్చరించారు. అదనపు సెక్షన్లకు అనుమతి తీసుకున్నాకే విద్యార్థులను చేర్చుకోవాలని, ప్రతి రోజూ అడ్మిషన్ల వివరాలను కాలేజ్ నోటీస్ బోర్డ్ లో పెట్టాలని తెలిపారు. జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించిందని అశోక్‌ తెలిపారు.