నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. ఇదీ ప్రత్యేకం

నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. ఇదీ ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఇవాళ విడుదలవనున్నాయి.  అమరావతిలోని ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను వెల్లడించనున్నారు. మొదటిసారిగా ఫలితాలను గ్రేడింగ్‌విధానంలో విడుదల చేస్తున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఏపీలో ఫిబ్రవరి 27 - మార్చి 16 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఫిబ్రవరి 28 - మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. మొత్తం 10,17,600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో చూడవచ్చు.. 

https://results.apcfss.in 
http://bieap.gov.in 
https://jnanabhumi.ap.gov.in