విదేశీ విమాన స‌ర్వీసుల‌పై క్లారిటీ..!

విదేశీ విమాన స‌ర్వీసుల‌పై క్లారిటీ..!

క‌రోనా లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన విదేశీ విమానాలు ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతాయ‌నే దానిపై క్లారిటీ లేదు.. క‌రోనా కాలంలో విదేశాల్లో చిక్కుకుపోయిన‌వారిని స్వ‌దేశానికి ర‌ప్పించ‌డానికి వందే భార‌త్ మిష‌న్ కింద ప్ర‌త్యేక విమానాలు న‌డుపుతున్నా.. ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసెస్‌లు ప్రారంభం కాలేదు.. అన్‌లాక్ 3.0లో అడుగుపెట్టినా.. ఇప్ప‌ట్లో పూర్తిస్థాయిలో  ప్రారంభం కావ‌డం క‌ష్ట‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.. ఎందుకంటే.. ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసెస్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఆగస్టు 31వ తేదీ వరకు కొన‌సాగ‌నున్న‌ట్టు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్ర‌క‌టించింది.. అయితే, ఈ పరిమితి అంతర్జాతీయ ఆల్-కార్గో ఆపరేషన్లు మరియు డీజీసీఏచే ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు వర్తించదు అని స్ప‌ష్టం చేసింది. 

భారతదేశంలో కోవిడ్ -19 పరిస్థితి కారణంగా లాక్‌డౌన్ కాలంలో చిక్కుకుపోయిన విదేశీయుల‌ను పంపించే విమానాలు కొన్ని న‌డ‌వ‌గా.. వందే భారత్ మిషన్ కింద,మొత్తం ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇప్ప‌టి వ‌ర‌కు 2,67,436 మంది ప్రయాణికులను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చింది. ఇక‌, ఇతర చార్టర్ల ద్వారా 2020 మే 6 నుండి జూలై 30 వరకు 4,86,811 మంది ప్రయాణికులను చేరుకున్నారు. మ‌రోవైపు.. యుఎస్ఎ, ఫ్రాన్స్ మరియు జర్మనీలతో ‘ట్రాన్స్పోర్ట్ బబుల్’ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇలా.. అనుమ‌తులు ఉన్న స‌ర్వీసులు మాత్రం న‌డ‌వ‌నున్నాయి.