యోగా దినోత్సవంలో క్రికెట్ వరల్డ్ కప్ 

యోగా దినోత్సవంలో క్రికెట్ వరల్డ్ కప్ 

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ యోగాసనాలు వేసి.. దైనందిన జీవితంలో యోగా ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ యోగాసనాలు వేశారు. యోగాను ఒక వేడుకలా భావించకుండా ప్రతి రోజు సాధన చేయాలి... మన నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. అయితే చెన్నైలోని విద్యార్ధులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు తమ మద్దతు తెలుపుతూ యోగాసనాలు వేశారు. ప్రపంచకప్ లో టీమిండియా రాణించాలని యోగా దినోత్సవం సందర్భంగా ఆకాంక్షించారు. విద్యార్ధులందరూ ప్రపంచకప్ ట్రోఫి ఆకారంలో యోగా చేసి పలువురిని ఆకర్షించారు.

ఐసీసీ ప్రపంచకప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 4 మ్యాచ్ లు ఆడిన భారత జట్టు 3 విజయాలు సాధించింది. న్యూజిలాండ్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. 7 పాయింట్లతో పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది. జూన్ 22న సౌతామ్టన్ లో టీమిండియా ఆఫ్గానిస్థాన్ తో తలపడనుంది.