సైరాలో అదే హైలైట్ యాక్షన్ ఎపిసోడ్..!!

సైరాలో అదే హైలైట్ యాక్షన్ ఎపిసోడ్..!!

మెగాస్టార్ సైరా సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతున్నది.  ఇదిలా ఉంటె, ఈనెల 18 వ తేదీన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట.  ఈ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్టు సమాచారం.  ఇదిలా ఉంటె, ఇందులో దాదాపు 10కి పైగా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని, అన్ని అద్భుతంగా ఉంటాయని అంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.  

ఈ పది యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే అండర్ వాటర్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా ఉంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి పేర్కొన్నాడు.  ఈ ఎపిసోడ్ ను ముంబైలోని ఓ భారీ స్విమ్మింగ్ పూల్ లో చిత్రీకరించినట్టు పేర్కొన్నారు.  దీనితరువాత ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నాడు సురేందర్ రెడ్డి.  ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.