ఎక్స్ క్లూజివ్  ఇంటర్వ్యూ : ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయ్యుండాలని ఏం లేదు కదా..!

ఎక్స్ క్లూజివ్  ఇంటర్వ్యూ : ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయ్యుండాలని ఏం లేదు కదా..!

పవన్ కళ్యాణ్ నటించిన 'బంగారం' సినిమా తో పాపులర్ అయిన హీరోయిన్ మీరా చోప్రా తాజాగా ఓ వివాదంలో ఇరుకుంది.  తనకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అంటూ హీరోయిన్ మీరా చోప్రా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంతో మీరా చోప్రాను ఇష్టానుసారంగా  బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి..మీరా చోప్రా ఏంచేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతలా విరుచుకుపడుతున్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...

-హలో మీరా చోప్రా గారు 

-హలో అండి

- చోప్రా గారు అసలు ఈ ఇష్యు ఎలా మొదలైంది.? 

- నేను మాములుగా నా ఫ్యాన్స్ తో చాట్ చేస్తున్నాను .. ఆ టైం లో ఒక వ్యక్తి నన్ను అడిగాడు మీ  అభిమాన హీరో ఎవరూ అని ..? దానికి నేను సమాధానంగా మహేష్ బాబు అంటే ఇష్టమని చెప్పాను. అతను వెంటనే మరి ఎన్టీఆర్ అంటే ..? అని అడిగాడు. దానికి నేను నాకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అని సమాధానం ఇచ్చాను. నేను ఎన్టీఆర్ తో కలిసి నటించలేదు. అతని గురించి తెలుసుకోలేదు. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయ్యుండాలని ఎం లేదు కదా .. నేను మహేష్ గురించి తెలుసుకున్నాను అండ్ అతనంటే నాకు ఇష్టం అని చెప్పను. ఇలా రాత్రి 10 గంటల వరకు చాట్ చేశాను. తర్వాత నేను నిద్రపోయాను. ఉదయాన్నే లేచి ఫోన్ చూసుకోగానే చాలా కామెంట్లు వచ్చాయి .. చాలా అసభ్యంగా మాట్లాడారు.. నువ్వు ఒక పోర్న్  స్టార్ , నువ్వు ఒక వేశ్యవి. ఒక రాత్రికి రేట్ ఏంత .? , ఇలా నీచంగా కామెంట్లు పెట్టారు. వాటిలో ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ .. అతని డీపీ కూడా ఎన్టీఆర్ ఫోటో ఉంది. అతను"మీ తల్లిదండ్రులు కరోనా తో చనిపోవాలని ఆశిస్తున్నా .." అని కామెంట్ పెట్టాడు. అది నన్ను చాలా బాధించింది. నాకు అనిపించింది అసలు వాళ్లకు అలా మాట్లాడే రైట్ ఎక్కడుంది.? నేను ఎన్టీఆర్ తో సినిమా చెయ్యలేదు.. అతని గురించి తప్పుగా మాట్లాడలేదు. అతని గురించి కూడా నాకు తెలియదు. అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా నీచంగా మాట్లాడటంతో నాకు కోపం వచ్చి వారి కామెంట్స్ కి హైదరాబాద్ పోలీసులను , సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాను. 

నాకు అర్ధంకాదు ఎన్టీఆర్ అసలు ఎలా స్టార్ అయ్యాడు..? తన ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసుకోపోతే ఎలా .. ?వాళ్ళు ఇలా గ్యాంగ్ రేప్స్ చేస్తాం , యాసిడ్ ఎటాక్ చేస్తాం.. మర్డర్  ఎటాక్ చేస్తా అని మాట్లాడుతున్నారు. ఈ విషయం ఎన్టీఆర్ కు తెలుసో లేదో తెలియదు కానీ కొంతమంది నాకు ట్వీట్ చేశారు . ఎన్టీఆర్ అభిమానులు అలానే నీచంగా మాట్లాడుతారు అని చెప్పారు. నాకు ఎన్టీఆర్ తెలియదు అన్నందుకు ఇంత పెద్ద విషయం చెయ్యాలా..? అయినా ఫ్యాన్స్ ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడుతుంటే ఆయన నోరుమూసుకుని ఎలా ఉంటారు..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరిని అలానే తిడతారు మీరెందుకు దాన్ని పెద్దది చేస్తున్నారు అని నన్ను అడిగారు. 

 

- ఎవరు అడిగారు అండి.. మిమ్మల్ని.?

-నాకు ట్వీట్స్ వచ్చాయి.   చాలా మంది అమ్మాయిలతో వాళ్ళు అలానే మాట్లాడుతారు అని .. ఇలాంటి ఫ్యాన్స్ ఉంటే మీరు సాధించింది ఏంటి.? ఇదేమి స్టార్ డమ్.? మీ ఫ్యాన్స్ ఇలా పబ్లిక్ గా నీచంగా మాట్లాడుతున్నారు. గ్యాంగ్ రేప్ చేస్తాం అంటున్నారు.ఇలాంటి ఫ్యాన్స్ ఉన్న  మీరేలా స్టార్ అవుతారో నాకు అర్ధం కావడంలేదు. నా ఫ్యాన్స్ ఇలా చేస్తే నేను వెంటనే క్షమించమని అడుగుతా .నేను సౌత్ తో కూడా యాక్ట్ చేశాను అక్కడ హీరోలను దేవుళ్లుగా చూస్తారు. అది నాకు తెలుసు. అలాంటి హీరోలు ఇలా తమ అభిమానులు నీచంగా మాట్లాడుతుంటే అలా మాట్లాడొద్దని చెప్పాలి వాళ్ళు వింటారు. నా ఒక్కదానికే కాదు చాలా మంది నటులకు ఇలా జరిగింది. చిన్మయి విషయంలో కూడా ఇలా జరిగింది. మరి వీళ్లు తమ అభిమానులకు ఎందుకు చెప్పడం లేదు.? ఇలా చెయ్యొద్దని. నాకు ఇప్పటికీ అర్ధంకావడంలేదు నేను వేరే హీరోని ఇష్టపడుతున్న అని నన్ను ఇలా దూషిస్తారా..? ఇదేమైనా పెద్ద క్రైమా  ..? దీనికి ఎన్టీఆర్ రెస్పాన్స్బులిటీ తీసుకోవాలి. నేను ప్రతియాక్టర్ ను రెస్పెక్ట్  చేస్తా.. 

 

- మీరు ఎన్టీఆర్ తన అభిమానులను కంట్రోల్ చెయ్యాలని అంటున్నారు. ఆయన ఒక్క మాట చెప్తే అభిమానులు వింటారు. మీరు కోరేది అదేనా.. ?

 ప్రత్యేకంగా ఎన్టీఆర్ అన్నే కాదు.  నాలా చాలామంది ఆడపిల్లలను ఇలా ఇతర యాక్టర్స్ ఫ్యాన్స్ కూడా నీచంగా మాట్లాడుతున్నారు. ఎందుకని ఆ హీరోలు అభిమానులను కంట్రోల్ చేయడంలేదు..?ఒక్క మాట చెప్తే వాళ్ళు వింటారు కానీ ఎందుకు చెప్పడంలేదు ..? నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేశాను. నా కళ్ళతో చూసాను ఆయన అభిమానులు చాలా సౌమ్యంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయన అభిమానులు వింటారు. మిగిలిన హీరోలు అలా ఎందుకులేరో నాకు అర్ధంకావడంలేదు. 

 

- మీరే అన్నారు సౌత్ లో హీరోలను దేవుళ్లుగా కొలుస్తారని. అలాంటప్పుడు మీరు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అనేసరికి వాళ్ళు కోపం తెచ్చుకొని ఉంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ చిన్న యాక్టర్ కాదు , ఇక్కడ స్టార్ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ తీస్తున్నాడు. అందుకని ఫ్యాన్స్ ఆగ్రహించి ఉంటారు. 

 

ప్రపంచంలో ఉన్న అందరికి ఎన్టీఆర్ తెలియాల్సిన అవసరం లేదుకదా ..? మేము ఢిల్లీలో ఉంటున్నాం నా తల్లిదండ్రులకు కూడా ఎన్టీఆర్ ఎవరో తెలియదు. 

 

- మీరు పోలీస్ కేసు పెట్టారా..?

-ఇచ్చానండి

 

- ఏమని ఇచ్చారండి.?

-  నేను  ముఖ్యంగా నాలుగు వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశాను . మొదటిది  గ్యాంగ్ రేప్ చేస్తామన్న ట్వీట్ పై , పోర్న్ స్టార్ ,  వేశ్య, చంపుతామంటూ.. అలాగే నా తల్లిదండ్రులు కరోనా తో చనిపోవాలంటూ చేసిన ట్వీట్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాను. 

 

- సింగర్ చిన్మయి మీకు సపోర్ట్ చేశారు.. ఆవిడా మీకు ఎలాంటి సూచనలు ఇచ్చారు. ?

- అవును ఆమె నాకు సపోర్ట్ చేశారు. నాకు చాలా మంది సపోర్ట్ చేశారు.  చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు.    ట్విట్టర్ లో కూడా 'సపోర్ట్ మీరా చోప్రా' అంటూ ట్యాగ్ చేస్తున్నారు.  చిన్మయి ట్వీట్ తర్వాత నాకు ఇలా  వదిలేయకూడదు ఎదో ఒకటి చేయాలి అనిపించింది. ఎందుకంటే ఆమె కూడా గతంలో ఇలాంటివి ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా మాట్లాడాపోతే మరో అమ్మయితో వాళ్ళు ఇలానే చేస్తారు. కొంత మంది ఎన్టీఆర్ అభిమానులు మహేష్ బాబునే కాకుండా ఆయన కూతురి గురించి కూడా నీచంగా మాట్లాడారు. 

 

- మీతో చిన్మయి ఫోన్ లో మాట్లాడారా.. ?   లేక సోషల్ మీడియాలోనే చాట్ చేసుకున్నారా..?

- అది మీకు అనవసరం . 

   

- మీరు పవన్ కళ్యాణ్ తో నటించారు  ఆయన అభిమానులను చూసారు. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను చూసారు మీకు ఎం తేడా కనిపించింది.?

- నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంత నీచమైన అభిమానులను ఎక్కడ చూడలేదు.నేను బాలీవుడ్ లోను చాలా మంది ఫ్యాన్స్ ను చూసాను. ఇంత చెత్త ఫ్యాన్స్ ను నేను నా జీవితంలో చూడలేదు .   ఇలాంటి నీచమైన ట్వీట్స్ కూడా చూడలేదు. 

 

 -టాలీవుడ్ లోని పెద్దలకు కంప్లెయింట్ చేసే ఆలోచన ఉందా .?

- లేదండి

- సౌత్ లో ఏమైనా సినిమాలు చేస్తున్నారా..?

- లేదండి.  నేను సౌత్ ను వదిలేసి 6 సంవత్సరాలు అయ్యింది. 

 

-సౌత్ ను వదిలి వెళ్ళడానికి కారణం ఏంటి .?

-నేను సౌత్ లో చాలా నేర్చుకున్నా , అండ్ ఐ లవ్ సౌత్ ఇండస్ట్రీ . బాష నాకు ఇబ్బంది కావడంతో వదిలి వచ్చేసా. టాలీవుడ్ లో చాలా మంచి ట్రీట్ మెంట్ ఇచ్చేవారు.  సౌత్ లో కాస్టింగ్

 కౌచ్ ఉందని విన్నాను కానీ నాకు ఎప్పుడు అలా జరగలేదు. 

 

- సైబర్ క్రైం లో పోలీస్ కేసు పెట్టారు. అభిమానులు క్షమాపణలు కోసమేనా ..?

-నాకు ఎలాంటి క్షమాపణలు అవసరం లేదు . ఎన్టీఆర్ తన అభిమానులను కంట్రోల్ లో పెట్టుకోవాలి . ఇలా నీచంగా ప్రవర్తించవద్దని చెప్పాలి. 

 

- ఎన్టీఆర్ రియాక్ట్ కాకపోతే ఏంచేస్తారు.?

- ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వకపోతే ఆయనకు ఉన్న స్టార్ డమ్ కు అర్ధం లేదు అని నేను అనుకుంటాను 

 

-థ్యాంక్యూ మీరా చోప్రా గారు.. మీ ప్రొబ్లెమ్స్ త్వరగా తీరిపోవాలని ఆశిస్తున్నాం .. 

- థాంక్యూ అండి.