రాజధానిలో ఇనసైడర్‌ ట్రేడింగ్...రంగంలోకి సిఐడి అధికారులు !

రాజధానిలో ఇనసైడర్‌ ట్రేడింగ్...రంగంలోకి సిఐడి అధికారులు !

రాజధాని భూముల్లో ఇనసైడర్‌ ట్రేడింగ్ జరిగిందంటున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ మీద ఆరా తీస్తోంది. రాజధాని ప్రకటించాక భూముల అమ్మిన వారు మొదలు కొన్న వాళ్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు CID అధికారులు.  గత మూడు రోజులుగా సిఐడి అధికారులు కృష్ణా జిల్లాలోని వీరుపాలడు, చెవిటికల్లు మండలాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఎంపీ సుజనా చౌదరి, బాలకృష్ణ వియ్యంకుడు కృష్ణా జిల్లాలో రాజధాని భూములు కొన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించిన విషయం తెలిసిందే. చెవిటికల్లు, మున్నలూరు, గనీ ఆత్కూరు, వీరులపాడు, వెల్లంకి గ్రామాల్లో భూముల అమ్మిన వారి వివరాలను సిఐడి సేకరిస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత 2014-15 నుంచి భూములు అమ్మిన, కొన్న వాళ్ల వివరాలతో వచ్చారు అధికారులు. భూములు ఎవరికి అమ్మారు..? ఎంతకు అమ్మారు..? ఎంత పొలం అమ్మారు...? ఎప్పుడు అమ్మారు? అనే వివరాలు రైతుల నుంచి తీసుకుంటున్నారు. భూములు కొన్న వ్యక్తులే రైతులు దగ్గరకు వచ్చారా? లేక బీనామీలు ఉన్నారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల భూములు అమ్మిన గని ఆత్కూరు రైతులు ముక్కపాటి నాగేశ్వరరావు,  రాయల పేరయ్యల నుంచి కొంత సమాచారం సిఐడి అధికారులు శుక్రవారం తీసుకున్నారు. భారీ స్థాయిలో వేసిన వెంచర్లలోకి వెళ్లిన అధికారులు అవి వేసిందెవరు ప్లాట్లు కొన్నదెవరన్న వివరాలు సేకరిస్తున్నారు.