సెప్టెంబర్ 9న ఏపీలో కీలక సదస్సు

సెప్టెంబర్ 9న ఏపీలో కీలక సదస్సు

సెప్టెంబర్‌ 9న ఏపీలో పెట్టుబడుల సదస్సు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. విజయవాడ కేంద్రంగా నిర్వహించే ఈ పెట్టుబడుల సదస్సుకు సుమారు 40 దేశాలకు చెందిన అంబాసిడర్లు, కాన్సులేట్ జనరళ్లు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే రీతిలో ఏపీలో అవకాశాలను వివరించేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. సదస్సులో భాగంగా విదేశీ డెలిగేట్లతో జగన్‌ వరుసగా భేటీ కానున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పెట్టుబడుల సదస్సులో ప్రత్యేకంగా ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూడిషియల్ కమిషన్, విద్యుత్ సంస్కరణల గురించి విదేశీ డెలిగేట్లకు స్వయంగా సీఎం జగన్‌ వివరించనున్నారు.