'వరల్డ్‌కప్‌లో భారత్‌పై కచ్చితంగా గెలుస్తాం'
పాకిస్థాన్-ఇండియా క్రికెట్ మ్యాచంటే ఆ థ్రిల్లే వేరు. అదీ.. వరల్డ్‌కప్‌లో అంటే ఇక అభిమానులను ఆపలేం. ఈ నెలాఖరున ప్రారంభమయ్యే ప్రపంచకప్‌లోనూ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుండడంతో అభిమానులు ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు.
రికార్డుల విషయానికి వస్తే.. వరల్డ్‌కప్ మ్యాచుల్లో ఇప్పటికీ ఒక్కసారి కూడా భారత్‌పై పాక్ గెలుపొందలేదు. ఐతే.. ఈసారి తమదే విజయమని, ఓటములకు బ్రేక్ వేస్తామని అంటున్నాడు పాక్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్. పాక్-ఇండియా మధ్య పోరు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న ఆయన.. భారత్‌పై పాకిస్థాన్ గెలిస్తే తమ దేశంలోని చాలా మంది సంతోషంగా ఉంటారని అన్నారు.
ఇక.. వామప్ మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్ చేతిలో పాక్ ఓడిపోవడంపై స్పందిస్తూ.. ఇటువంటి మెగా టోర్నమెంట్లలో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోకూడదని ఇంజమామ్ అభిప్రాయపడ్డాడు. ఏ జట్టుపై గెలిచినా రెండు పాయింట్లు వస్తాయని గుర్తు చేశాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)