అలా చేస్తే అథ్లెట్లు అడ్డదారులు తొక్కుతారు కావచ్చు : ఐఓసీ   

  అలా చేస్తే అథ్లెట్లు అడ్డదారులు తొక్కుతారు కావచ్చు : ఐఓసీ   

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఒలంపిక్స్ తో సహా అని క్రీడలు వాయిదా పడ్డాయి. అందువల్ల ఆ ప్రభావం ఆటగాళ్లు, కోచ్ లు, పనిచేసే  సిబ్బంది జీతాలపై పడుతుంది. దాంతో వారందరు అడ్డదారులు తొక్కుతారు అనే అనుమానాన్ని అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ( ఐఓసీ) వ్యక్తం చేసింది. ఈ మధ్య  ఐఓసీ ప్రచారం చేసిన ఓ అధ్యనంలో ఈ తరహా అనుమానాలు వ్యక్తం చేసింది. అందులో...  క్రీడారంగాల్లో పని చేసే వ్యక్తులకు ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వారికి జీతాల్లో కోతలు విధిస్తున్నారు, ఆ వచ్చే జీతం కూడా వారికి రావడానికి ఆలస్యం అవుతుంది. ఈ అవకాశాన్ని అవినితిపరులు, బుకీలు అదునుగా తీసుకునే ప్రమాదం ఉంది. ఇక  ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న అథ్లెట్లు కూడా అడ్డదారులు తొక్కుతారు కావచ్చు దాంతో లాక్  డౌన్ తర్వాత జరిగే క్రీడలో అవినీతి జరిగే ప్రమాదం ఉంది అని ఆ అధ్యనంలో తెలిపింది.