ఐ ఫోన్ 11 సిరీస్.. బుకింగ్, సేల్స్..

ఐ ఫోన్ 11 సిరీస్.. బుకింగ్, సేల్స్..

ఐఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభతరుణం వచ్చేసింది. ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది యాపిల్ కంపెనీ. అత్యంత శక్తిమంతమైన ఏ13 బయోనిక్‌ సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఈ ఫోన్‌ల ప్రత్యేకతగా సంస్థ ప్రకటించింది. ఇదేవిధంగా సిరీస్‌ 5 యాపిల్‌వాచ్‌ను, 7వ తరం ఐప్యాడ్‌ను కూడా కూడా విడుదల చేసింది. ఈనెల 13 నుంచి ఈ ఫోన్ల కోసం బుకింగ్‌ చేసుకోవచ్చని, ఈనెల 20 నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని ప్రకటించింది. ఐఫోన్‌ 11 ధర 699 డాలర్ల నుండి ప్రారంభమవుతుందని యాపిల్ సంస్థ ప్రకటించింది. 

ఈ న్యూ మోడల్స్‌లో కెమెరా అప్ గ్రేడ్ బిగ్గెస్ట్ అప్ డేట్ అని చెబుతున్నారు. మల్టీ కెమెరా సిస్టమ్‌తో తొలిసారి రిలీజ్ చేయబోతున్నారు. ఐ ఫోన్ 11 ప్రొ, ఐ ఫోన్ 11 ప్రో మ్యాక్స్ మోడల్స్ లో వెనుకవైపున స్క్వేర్ షేప్ లో 3 కెమెరాలు ఉన్నాయి. కాగా, ఈ ఏడాది తొలి అర్ధభారంగా ఎక్కువగా అమ్ముడుపోయిన ఐ ఫోన్ ఎక్స్‌ఆర్, ఎక్స్‌ ఎస్‌, ఎక్స్‌ ఎస్ మ్యాక్స్ మోడల్స్‌ను ఈ కొత్త మోడల్స్ రీప్లేస్ చేస్తాయంటున్నారు. భారతదేశంలో ఐఫోన్ 11 ధరలు ఇలా ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 11.. 64 జీబీ ధర రూ.64,900గా ఉండనుండగా.. ఈ ఫోన్ 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో కూడా ఇవ్వబడుతుంది. రూ. 69,900, రూ. 79,900కు లభించనున్నాయి. ఐఫోన్ 11 పర్పుల్, వైట్, గ్రీన్, ఎల్లో, బ్లాక్ మరియు రెడ్ ఇలా ఆరు రంగులలో వస్తుంది.. ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 13న యూఎస్ సహా ప్రపంచంలోని 30కి పైగా దేశాల్లో ఓపెన్ చేయనున్నారు. ఇక, వీటి అమ్మకాలు సెప్టెంబర్ 20 ప్రారంభం కానుండగా.. భారత్‌లో సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమవుతాయి.