ఐఫోన్ నుంచి త్రీ వెరైటీస్ త్వరలో..

ఐఫోన్ నుంచి త్రీ వెరైటీస్ త్వరలో..

ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ కంపెనీ ఆపిల్.. తన బ్రాండ్ ఐఫోన్స్ లో మరో మూడు వెరైటీలను త్వరలో లాంచ్ చేయబోతోంది. అవి లాంచయ్యే తేదీ కూడా ఖరారైంది. ఈ నెల 12నే అవి మార్కెట్లోకి విడుదలవుతాయని ఓ ప్రకటన ద్వారా తెలుస్తోంది. 5.8 అంగుళాల్లో ఐఫోన్ ఎక్స్ఎస్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఐఫోన్ ఎక్స్ ను అప్ గ్రేడ్ చేస్తూ ఐఫోన్ ఎక్స్ఎస్ ను తీసుకొస్తున్నారు. ఇక 6.5 ఇంచుల ఐఫోన్ ఎక్స్ ప్లస్ కూడా అదే విడుదల కానుంది. ఐఫోన్స్ లో ఇప్పటివరకు వచ్చిన అన్ని వెరైటీస్ కన్నా ఇదే పొడవుగా ఉంటుంది. ధర కూడా అన్నిటికన్నా ఎక్కువే ఉండే అవకాశాలున్నాయంటున్నారు. కనీస ధర 999 డాలర్లు గా ఉండొచ్చని అంచనా. ఈ రెండు మోడల్స్ కూడా ఓఎల్ఈడీ స్క్రీన్స్ కలిగి ఉంటాయి. 

ఇక మూడో వెరైటీలో 6.1 అంగుళాల్లో వస్తున్న మోడల్.. మాస్ పీపుల్ అవసరాలకు తగినట్టుగా ఉంటుందని, కాబట్టి ఇండియా వంటి దేశాల్లో దీనికి డిమాండ్ బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుందని గ్యాడ్గెట్స్ నౌ విశ్లేషించింది. సింగిల్ రియర్ కెమెరాతో ఉండే ఈ వెరైటీ అన్నింటికన్నా తక్కువ ధర చేస్తుందంటున్నారు. ఇక త్రీ మోడల్స్ కూడా ఐఫోన్ ఎక్స్ లాగే ఆకర్షణీయమైన డిస్ ప్లే లు కలిగి ఉంటాయని, మూడింటికీ ఎ12 బయోనిక్ ప్రాసెసర్స్ ఉంటాయని గ్యాడ్గెట్స్ సంస్థ విశ్లేషించింది.