సన్ రైజర్స్ vs కోల్ కతా...చెన్నై వేదికగా...

సన్ రైజర్స్ vs కోల్ కతా...చెన్నై వేదికగా...

సమ్మర్ వచ్చింది అంటే క్రికెట్ అభిమానులకు పెద్ద పండగ వచ్చినట్టే.  ఐపీఎల్ టోర్నీ ప్రారంభం అయ్యాక ఇప్పటి వరకు 13 సీజన్లు ముగిశాయి.  ప్రస్తుతం ఐపీఎల్ 14 వ సీజన్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.  కరోనా నిబంధనలు పాటిస్తూ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు.  ఏ జట్టు కూడా తన హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ లు ఆడటం లేదు.  14 వ సీజన్ లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ముగిశాయి.  కాగా, ఈరోజు చెన్నై వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతున్నది.  గత 13 వ సీజన్ లో ప్లే ఆఫ్ వరకు చేరుకొని ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది.  గత సీజన్ లో చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా, విజయాలు సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు. 

మిచెల్ మార్ష్ ఈ సీజన్ లో కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు జేసన్ రాయ్ ను జట్టులోకి తీసుకున్నారు.  అయితే, రాయ్ ఇంగ్లాండ్ నుంచి రావడంతో ప్రోటోకాల్ ప్రకారం వారం రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి.  దీంతో జేసన్ రాయ్ ఈరోజు కోల్ కతాతో జరిగే మ్యాచ్ లో, ఏప్రిల్ 14 న బెంగళూరుతో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశం ఉండకపోవచ్చు.  ఈరోజు సాయంత్రం చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు గెలవాలని కోరుకుందాం.