చేపాక్‌ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు

చేపాక్‌ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) సీజన్‌ -12 మార్చి 23న ప్రారంభం అవుతోంది. తొలి మ్యాచ్‌ చెన్నై చేపాక్‌ క్రికెట్‌ స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు చేపాక్‌ స్టేడియం వద్ద టిక్కెట్ల విక్రయాలను ప్రారంభించారు. అయితే టిక్కెట్ల కోసం అభిమానులు పోటీపడుతున్నారు. రూ.1,500 నుంచి రూ.6,500 వరకు టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

ఉదయం 6 గంటల నుంచే టిక్కెట్ల కోసం అభిమానుల పోటెత్తారు. టిక్కెట్ల విక్రయం ప్రారంభించే సమయానికి వేల సంఖ్యలో అభిమానులు చేపాక్‌ స్టేడియంకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు ఉండడంతో తోపులాట జరిగింది. వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యమైంది. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జీ చేయడంతో పలువురి అభిమానులకు స్వల్పంగా గాయాలయ్యాయి.