చెలరేగిన ధోనీ.. ఢిల్లీకి టఫ్‌ టార్గెట్‌

చెలరేగిన ధోనీ.. ఢిల్లీకి టఫ్‌ టార్గెట్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరగులు చేసింది. 3.2 ఓవర్లలో కేవలం 4 పరుగులే చేసి నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన చెన్నై.. రైనా, ధోనీ చెలరేగడంతో టఫ్‌ టార్గెట్‌ను ఢిల్లీ ముందుంచింది. సుచిత్ వేసిన 4వ ఓవర్ రెండో బంతికి వాట్సన్ పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. ఈ దశలో రైనా, డుప్లెసిస్‌ రెండో వికెట్‌కి 83 పరుగులు జోడించారు. 14వ ఓవర్లో డుప్లెసిస్(39) అవుటవగా.. 15వ ఓవర్లో రైనా(59) పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత ధోనీ, జడేజా వేగంగా పరుగులు రాబట్టారు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన జడేజా...క్రిస్‌మోరిస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివరి ఓవర్లో ఏకంగా 21 పరుగులు రాబట్టడంతో 179 పరుగుల భారీ స్కోరు చేసింది చెన్నై. ధోనీ 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులతో అజేయంగా నిలిచాడు.