ధోనీ సూపర్‌ స్టంపింగ్స్ సీక్రెట్‌ ఇదేనట..

ధోనీ సూపర్‌ స్టంపింగ్స్ సీక్రెట్‌ ఇదేనట..

బ్యాట్‌తో చెలరేగే మహేంద్ర సింగ్‌ ధోనీ.. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా ఉంటాడు. క్యాచ్‌లను వదలడు.. స్టంపింగ్స్‌ను మిస్సవడు. ముఖ్యంగా.. రెప్పపాటులో స్టంపింగ్స్‌ చేయడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ధోనీ మరోసారి తన కీపింగ్‌ మహిహను చూపించాడు. ఒకే ఓవర్‌లో మోరిస్‌, శ్రేయస్‌ అయ్యర్‌లకు తన మెరుపు స్టంపింగ్‌తో షాకిచ్చాడు. మోరిస్‌ను 0.12 సెకన్లలో, అయ్యర్‌ను 0.16 సెకన్లలో స్టంపౌట్‌ చేశాడు ధోనీ. తన సూపర్‌ స్టంపింగ్స్‌ వెనుక ఉన్న రహస్యాన్ని స్వయంగా ధోనీయే బయటపెట్టాడు. టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ వల్లే తాను వేగంగా స్టంపౌట్లు చెయ్యగలుగుతున్నానని తెలిపాడు. బేసిక్స్‌ కచ్చితంగా నేర్చుకుంటే తప్పులు చేసేందుకు ఆస్కారం ఉండదని చెప్పాడు.