భారత రోడ్లపై జంతువుల గురించి మైకెల్ వాన్ ట్వీట్, మండిపడ్డ ఇండియన్స్

భారత రోడ్లపై జంతువుల గురించి మైకెల్ వాన్ ట్వీట్, మండిపడ్డ ఇండియన్స్

ఐపీఎల్ లో ఆడేందుకు విదేశాల నుంచి చాలా మంది క్రికెటర్లు వచ్చారు. ఐపీఎల్ ద్వారా ఈ ఆటగాళ్లలో చాలా మంది అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. ఎందరో విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ ప్రదర్శన ద్వారా తమ జాతీయ జట్టులో స్థానం సంపాదించారంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది కూడా చాలా మంది కొత్త ముఖాలు, దిగ్గజ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతున్నారు. ఎక్స్ పర్ట్ కామెంట్స్, కామెంట్రీ కోసం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కూడా భారత్ వచ్చాడు. అతను భారత్ లోని అనేక నగరాల్లో తిరుగుతున్నాడు. ఐపీఎల్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు వాన్ తన ట్విట్టర్ లో భారత రోడ్లపై చేసిన కామెంట్స్ చూసి భారతీయులు కోపంతో మండిపడుతున్నారు. 

మైకెల్ వాన్ తన ట్వీట్ లో 'భారత్ లో తిరగడం ఎంతో బాగుంది. ఉదయం వరకు మేం నడిరోడ్లపై ఏనుగులు, ఆవులు, ఒంటెలు, గొర్రెలు, పందులు తిరగడం చూశాం' అని రాశాడు. వాన్ ఈ ట్వీట్ చదివిన భారతీయ అభిమానులు అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు. మైకెల్ వాన్ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. అశ్విన్ మన్కడింగ్ వివాదం కావచ్చు, ఎవరైన ఆటగాడిపై చర్చ కావచ్చు.. ప్రతి చర్చలో పాల్గొంటారు. ఈ సారి మాత్రం భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ కి వాన్ అడ్డంగా బుక్కయ్యారు.

ఒక యూజర్ అయితే 'ఏదైనా మీ తాతముత్తాతలు భారత్ లో చేశారో.. దేశాన్ని దోచుకోవడం. అన్ని వనరులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ కర్మలు తిరిగి వస్తున్నాయి' అని రాశారు. మరొకరు 'ఆ జంతువులకు కూడా మిమ్మల్ని కలుసుకొని అంతే సంతోషం కలిగి ఉండొచ్చు' అని పేర్కొన్నారు. ఇంకొకరు 'ప్రపంచ కప్, యాషెస్ కి ఇంగ్లిష్ టీమ్ ఎంపికపై దృష్టి పెట్టండి. సరైన సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఫామ్ లోకి వచ్చినట్టు తెలిసింది' అని పంచ్ విసిరారు.