సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌ ఉందా..?

సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌ ఉందా..?

ప్లేఆఫ్స్‌లో చోటు ఖాయమనుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఇప్పుడు అదృష్టంపై ఆధార పడింది. ముంబై ఇండియన్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌ ఫలితం కోసం ఎదురు చూస్తోంది. ఈమ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ గెలిస్తే.. రన్‌రేట్‌ ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరేందుకు సన్‌రైజర్స్‌కు మెరుగైన అవకాశాలున్నాయి. ఒక వేళ కోల్‌కతా గెలిస్తే.. ఇక సన్‌రైజర్స్‌ ఇంటి ముఖం పట్టాల్సిందే. తమ చేతిలో ఉన్న ఆఖరి విజయావకాశాన్ని నిన్న సన్‌రైజర్స్‌ జట్టు వదులుకుంది. గెలిస్తే తుది 4లోచోటు ఖాయమనుకునే మ్యాచ్‌లో  చేరే మ్యాచ్‌లో బాధ్యతారహితంగా ఆడింది తగిన మూల్యం సమర్పించుకుంది. 

మరోవైపు.. వరుసగా 6 మ్యాచుల్లో ఓడిన కోల్‌కతా.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణిస్తూ ప్రమాదకర జట్టుగా మారింది. ఈక్రమంలో ఇవాళ ముంబైతో జరిగే మ్యాచ్‌ కీలకంగా మారింది.