వారి ఆధ్వర్యంలో ఆడటం కొత్త అనుభూతి: పృథ్వీషా

వారి ఆధ్వర్యంలో ఆడటం కొత్త అనుభూతి: పృథ్వీషా

దిగ్గజ ఆటగాళ్ల ఆధ్వర్యంలో ఆడటం కొత్త అనుభూతని టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీషా తెలిపారు. టీమిండియాకు ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ చేసి అందరిని ఆకర్షించాడు పృథ్వీషా. ఆ పర్యటన అనంతరం గాయం కారణంగా గత నాలుగు నెలలుగా క్రికెట్‌కు దూరమయ్యాడు. విశ్రాంతి సమయంలో పూర్తిగా కోలుకున్న పృథ్వీషా ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సీజన్ - 12లో డిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముంబయి ఇండియన్స్‌తో డిల్లీ క్యాపిటల్స్‌ ఈ రోజు రాత్రి తలపడనుంది.

తాజాగా పృథ్వీషా మాట్లాడుతూ... ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆడి మ్యాచులు గెలిపించడమే తన లక్ష్యం అని తెలిపాడు. మెంటర్‌గా సౌరవ్ గంగూలీ, కోచ్‌గా రికీ పాంటింగ్‌ లాంటి అనుభవజ్ఞులైన మాజీ క్రికెటర్లు ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. వారి ఆధ్వర్యంలో ఆడటం ఓ కొత్త అనుభూతని పేర్కొన్నాడు. టీంఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌ ఇప్పటికే ఐపీఎల్‌లో మంచి అనుభవం కలిగి ఉన్నాడు, అతడితో కలిసి ఓపెనింగ్‌ చేస్తే.. సలహాలు తీసుకుంటానని పృథ్వీషా చెప్పుకొచ్చాడు.