ఐపీఎల్ 2019: రాయల్స్‌ జెర్సీ మారింది..!

ఐపీఎల్ 2019: రాయల్స్‌ జెర్సీ మారింది..!

 అన్నీ ఉన్నా అదృష్టం కలిసిరాని రాజస్థాన్‌ రాయల్స్‌.. ఐపీఎల్ 2019లో ఎలాగైనా సత్తా చాటాలని డిసైడ్‌ అయింది. ఇప్పటికే సపోర్టింగ్‌ స్టాఫ్‌ను మార్చిన రాజస్థాన్‌ జట్టు.. ఇప్పుడు ఏకంగా జెర్సీ కలర్‌నే మార్చేసింది. గతేడాది వరకు బ్లూ కలర్‌ జెర్సీతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ ప్లేయర్స్‌.. ఈ సీజన్‌లో పింక్‌ డ్రెస్‌లో ఆడనున్నారు. 2018 ఐపీఎల్ సీజన్‌లో కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పింక్ కలర్ జెర్సీతో ఓ మ్యాచ్ ఆడిన రాజస్థాన్ జట్టు.. ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ అదే జెర్సీతో ఆడబోతోంది. ఈ విషయంపై కెప్టెన్‌ అజింక్యా రహానె స్పందిస్తూ.. 'జైపూర్ అంటేనే పింక్ సిటీ కదా..? మరెందుకు పింక్ కలర్ జెర్సీని రాజస్థాన్ రాయల్స్ వేసుకోకూడదు' అని అన్నాడు. ఇక.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుంది. ఈ మార్పులైనా ఈ జట్లకు లక్కీగా మారుతాయేమో చూడాలి మారి.