ధోనీని అధిగమించిన పంత్‌

ధోనీని అధిగమించిన పంత్‌

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ అధిగమించాడు. అయితే ఈ రికార్డు ఇంటర్నేషనల్ క్రికెట్ లో మాత్రం కాదు. ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ హాఫ్ సెంచరీ చేసాడు. ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ 18 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. దీంతో గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ చేసిన వేగవంతమైన హాఫ్ సెంచరీ (20 బంతుల్లో) రికార్డును పంత్‌ అధిగమించాడు. ధోనీ 2012 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ పైనే వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసాడు.

అయితే ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీని టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ నమోదు చేసాడు. 2018లో రాహుల్‌ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. సునీల్‌ నరైన్‌, యూసుఫ్‌ పఠాన్‌లు సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు 15 బంతుల్లో 50 పరుగులు చేశారు.