రైనా @ 5000

రైనా @ 5000

ఐపీఎల్‌-12 సీజన్ మొదటి మ్యాచ్‌లోనే డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు, భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అరుదైన ఘనత సాధించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శనివారం చెన్నైసూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రైనా 5 వేల పరుగులు పూర్తి చేసాడు. దీంతో ఐపీఎల్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు రైనా 4,985 పరుగులతో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో రైనా 19 పరుగులు చేసి.. 5 వేల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. రైనా తర్వాతి స్థానంలో భారత, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (4954) ఉన్నాడు.