బెంగళూరు మళ్లీ ఓడిపోయింది

బెంగళూరు మళ్లీ ఓడిపోయింది

ప్రత్యర్ధి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచినా బెంగళూరు మళ్లీ ఓడిపోయింది. శుక్రవారం కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో చేజేతులా విజయాన్ని జారవిడుచుకుంది. థ్రిల్లింగ్ గా సాగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కత్తా 5 వికెట్ల తేడాతో బెంగళూరు పై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (49 బంతుల్లో 84; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్ (32 బంతుల్లో 63; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. తర్వాత కోల్ కత్తా 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (31 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఉతప్ప (25 బంతుల్లో 33; 6 ఫోర్లు), రానా (23 బంతుల్లో 37; 1 ఫోర్, 2 సిక్సర్లు ) తలా కొన్ని పరుగులు సాధించారు. ఐతే కీలక సమయంలో వికెట్లు పడటం, సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోవడంతో కోల్‌కతా క్రమంగా లక్ష్యానికి దూరమైనట్లు కనిపించింది. కానీ చివర్లో రస్సెల్ అనూహ్యంగా చెలరేగి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. రస్సెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: పార్థివ్‌ ఎల్బీ (బి) రాణా 25; కోహ్లి (సి) అండ్‌ (బి) కుల్‌దీప్‌ 84; డివిలియర్స్‌ (సి) గిల్‌ (బి) నరైన్‌ 63; స్టాయినిస్‌ నాటౌట్‌ 28; మొయిన్‌ అలీ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 205

బౌలింగ్‌: ప్రసిద్ధ్‌ కృష్ణ 3-0-41-0; చావ్లా 4-0-32-0; నరైన్‌ 4-0-30-1; ఫెర్గూసన్‌ 2-0-32-0; కుల్‌దీప్‌ 4-0-31-1; రాణా 2-0-22-1; రసెల్‌ 1-0-16-0

కోల్‌కతా ఇన్నింగ్స్‌: లిన్‌ (బి) నేగి 43; నరైన్‌ (సి) నేగి (బి) సైని 10; ఉతప్ప (సి) సౌథీ (బి) నేగి 33; రాణా (సి) క్లాసన్‌ (బి) చాహల్‌ 37; దినేశ్‌ కార్తీక్‌ (సి) చాహల్‌ (బి) సైని 19; రసెల్‌ నాటౌట్‌ 48; శుభ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 206

బౌలింగ్‌: సౌథీ 4-0-61-0; సైని 4-0-34-2; చాహల్‌ 4-0-24-1; సిరాజ్‌ 2.2-0-36-0; నేగి 3.1-0-21-2; స్టాయినిస్‌ 1.4-0-28-0