ఐపీఎల్ 2020-21 షెడ్యూల్ విడుదల... హైదరాబాద్ లో మ్యాచ్ లు... 

ఐపీఎల్ 2020-21 షెడ్యూల్ విడుదల... హైదరాబాద్ లో మ్యాచ్ లు... 

ఐపీఎల్ 2020-21 షెడ్యూల్ ను ఈరోజు రిలీజ్ చేశారు.  కరోనా కారణంగా గతేడాది ఆలస్యంగా మ్యాచ్ లు జరిగాయి.  అది దుబాయ్ వేదికగా మ్యాచ్ లు జరిగిన సంగతి తెలిసిందే.  ఈ ఏడాది 14 వ సీజన్ కు సంబంధించిన ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్ ను కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.  ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు మ్యాచ్ లు జరగబోతున్నాయి.  తొలిమ్యాచ్ ముంబై-బెంగళూరు మధ్య చెన్నై వేదికగా జరగనుంది.  చెన్నై, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్ కతా వేదికలుగా మ్యాచ్ లు జరగబోతున్నాయి.  ప్లే ఆఫ్, ఫైనల్స్ మ్యాచ్ లు అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరుగుతాయి. అయితే, హైదరాబాద్ లో ఈసారి ఎలాంటి మ్యాచ్ లు జరగడం లేదు.  ఇది క్రికెట్ అభిమానులకు నిరాశకలిగించే అంశంగా చెప్పాలి.